: దక్షిణాఫ్రికాపై విజయం కోసం హనుమంతుడిని ప్రార్థిస్తున్న అభిమానులు!


చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించాలని కోరుతూ క్రికెట్ అభిమానులు హనుమంతుడిని ఆశ్రయించారు. యూపీలోని పలు ప్రాంతాల్లో మ్యాచ్ గెలిపించాలని కోరుతూ ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేశారు. వారణాసి, లక్నో తదితర ప్రాంతాల్లో యాగాలు నిర్వహించి, జట్టు విజయానికి ప్రార్థనలు చేశారు. కాగా, దక్షిణాఫ్రికాతో గతంలో ఆడిన మ్యాచ్ లను పరిశీలిస్తే, జట్టు విజయావకాశాలు అంత సంతృప్తిగా లేకపోయినా, గత సంవత్సరం జరిగిన సిరీస్ లో సౌతాఫ్రికాపై ఇండియా విజయం సాధించింది. అదే ఊపును ఇండియా నేడు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News