: రష్యా భామను వేధిస్తున్న గాయం.. వింబుల్డన్ నుంచి షరపోవా ఔట్!


రష్యా భామ, మాజీ వరల్డ్ నంబర్ వన్ మారియ షరపోవా (30) వింబుల్డన్ నుంచి తప్పుకుంది. తొడగాయం తగ్గకపోవడంతో వింబుల్డన్ నుంచి తప్పుకుంటున్నట్టు షరపోవా ప్రకటించింది. ప్రస్తుతం తన తొడకు అయిన గాయం గ్రాస్ కోర్టు టోర్నమెంట్ నుంచి దూరంగా ఉంచిందని,  ఇది తనకు తీవ్ర నిరాశ కలిగించిందని పేర్కొంది. జూలై 31 నుంచి స్టాన్‌ఫోర్డ్‌లో జరగనున్న టోర్నీలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంది.

డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోయి 15 నెలల నిషేధానికి గురైన షరపోవా ఈ ఏప్రిల్‌లో స్టుట్‌గార్ట్ ఓపెన్‌లో తిరిగి బరిలోకి దిగింది. మెల్డోనియం డ్రగ్ తీసుకున్నందుకు గాను షరపోవాపై రెండేళ్ల నిషేధం విధించగా, తర్వాత కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ కోర్ట్ (సీఏఎస్) దానిని 15 నెలలకు తగ్గించింది.

  • Loading...

More Telugu News