: హైద‌రాబాద్‌లో దారుణం.. త‌ల్లి చ‌నిపోయిన‌ట్లు డెత్ స‌ర్టిఫికెట్ సృష్టించిన త‌న‌యుడు!


త‌మ‌ని అల్లారుముద్దుగా పెంచిన త‌ల్లిదండ్రుల మ‌మ‌కారాన్ని మ‌ర‌చి, పుత్ర‌ర‌త్నాలు అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. త‌ల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే వారికి క‌నీసం అన్నం కూడా పెట్ట‌కుండా నిర్ల‌క్ష్యంగా ప్ర‌వ‌ర్తిస్తోన్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. తల్లిదండ్రుల నుంచే ఆస్తులను తీసుకుంటున్న తనయులు అనంతరం వారిని పట్టించుకోవడమే మానేస్తున్నారు. కొందరు వారిని ఎలాగోలా మోసం చేసి వారి ఆస్తినంతా లాక్కోవాలని భావిస్తున్నారు.

తాజాగా హైద‌రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఓ త‌న‌యుడు చేసిన‌ ఇటువంటి దారుణ ఘ‌ట‌నే వెలుగులోకి వ‌చ్చింది. త‌ల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ద‌క్కించుకోవ‌డం కోసం బ‌తికున్న త‌ల్లి చ‌నిపోయిన‌ట్లు డెత్ స‌ర్టిఫికెట్ సృష్టించాడు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న త‌ల్లి ప్ర‌సూనాంబ‌ (70) స్థానిక పోలీసుల‌కు త‌న కొడుకు వ్య‌వ‌హారంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు జంధ్యాల విష్ణుకుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.  

  • Loading...

More Telugu News