: చనిపోయినోళ్ల వేలి ముద్రలతో కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు: కేటీఆర్


కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఆత్మీయ బహిరంగ సభలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత‌లు ప్రాజెక్టుల‌కు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. చనిపోయినోళ్ల వేలి ముద్రలతో కేసులు వేయిస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 60 ఏళ్లలో చేయ‌లేని అభివృద్ధిని త‌మ ప్ర‌భుత్వం మూడేళ్లలో చేయ‌డం ఎలా సాధ్యమవుతుంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి ప‌ట్టిన‌ 60 ఏళ్ల‌ దరిద్రం మూడేళ్లలోనే పోతుందా? అని అడిగారు. 60 ఏళ్ల‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవ‌లం 20 గురుకులాలే నెలకొల్పింద‌ని, త‌మ ప్ర‌భుత్వం మూడేళ్లలోనే 120 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని అన్నారు.  

  • Loading...

More Telugu News