: గోడలపై అంటించిన సినిమా పోస్టర్లను చించేసిన ఏపీ మంత్రి నారాయణ!
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నగర సుందరీకరణ పనులను గురించి తెలుసుకుంటూ డీఎంఏ కన్నబాబుతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు నగరంలోని గోడలపై సినిమా పోస్టర్లు అంటించి ఉండడం కనిపించింది. రాజ్ తరుణ్-హెబ్బాపటేల్ కాంబినేషన్లో ఇటీవల విడుదలైన ‘అంధగాడు’ సినిమా పోస్టర్‌లు గోడలపై అంటించి, గోడలను పాడు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా ఆ సినిమా పోస్టర్లను చించేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు కన్పించకూడదని, ఈ నెల 5న ప్రభుత్వం రాష్ట్రాన్ని పోస్టర్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రకటన చేసిందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్ వేయాలని సూచించారు.