: గాంధీని కించపరిచేలా మాట్లాడిన అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందే: కాంగ్రెస్
మహాత్మాగాంధీ తెలివైన వ్యాపారి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించాయి. షా వ్యాఖ్యల పట్ల పలువురు నేతలు మండిపడ్డారు. మహాత్మాగాంధీనే కించపరిచేలా మాట్లాడిన అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో కృషి చేసిన గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా షా వ్యాఖ్యలను ఖండించారు. ప్రజల వద్ద ప్రముఖుల గురించి మాట్లాడేటప్పుడు వారిని గౌరవించాలని చెప్పారు. సరైన భాషను వాడాలని అన్నారు. 2019 ఎన్నికల కోసం బీజేపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి అమిత్ షా దేశవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛత్తీస్ ఘడ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని... స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీ సూచించారని చెప్పారు.