: దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం ఇది... అధికారులను బదిలీ చేస్తే సరిపోతుందా?: దత్తాత్రేయ
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వెలుగులోకి వచ్చిన భూ కుంభకోణం అంశంపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని చెప్పారు. ఈ కేసులో అధికారుల సస్పెన్షన్‌తో ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. ఇంత పెద్ద కుంభకోణం విషయంలో కొందరు రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంత పెద్ద కుంభకోణం కేసుని సీబీఐకి అప్పగించకుండా సీఐడీకి ఇవ్వడమేంటని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.