: మహాత్మాగాంధీ ఓ తెలివైన వ్యాపారి.. ఆ విషయాన్ని ముందే పసిగట్టారు!: అమిత్ షా


జాతిపిత మహాత్మాగాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఓ తెలివైన వ్యాపారి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆయన ముందే పసిగట్టారని... అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆయన సూచించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విలువలు లేవని అన్నారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు, సూత్రాలు లేవని చెప్పారు. స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. దేశంలో ఉన్న 1650 రాజకీయ పార్టీల్లో కేవలం బీజేపీ, సీపీఎంలలో మాత్రమే అంతర్గత స్వేచ్ఛ ఉందని చెప్పారు. కాంగ్రెస్ లో సోనియా తప్పుకుంటే ఆమె కుమారుడు అధ్యక్షుడు అవుతారని... బీజేపీలో మాత్రం ఎవరు అధ్యక్షుడు అవుతారో చెప్పలేమని అన్నారు. 

  • Loading...

More Telugu News