: సల్మాన్ కి పిల్లలంటే ఎంత ఇష్టమో.. ఈ వీడియో చూడండి.. మీకే తెలుస్తుంది!


ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ను సుదీర్ఘ కాలం డ్రంకెన్ డ్రైవ్, కృష్ణ జింకల కేసులు వెంటాడాయి. దీంతో గత 20 ఏళ్ల పాటు సల్మాన్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడు. బాలీవుడ్ లో చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన వాడిగా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ దాని నుంచి బయటపడేందుకు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేవా కార్యక్రమాల కోసం అప్పుడప్పుడు సల్మాన్ స్లమ్స్ లో తిరుగుతుంటాడు. తాజాగా అలా ఒక స్లమ్ లోకి వెళ్లిన సల్మాన్ ను అభిమానులు, కాలనీ వాసులు చుట్టుముట్టగా, సెక్యూరిటీ మధ్య స్లమ్ వీధుల్లో తిరిగాడు.

 ఈ సందర్భంగా ఒక ఇంటి ముందు ఒక మహిళ చంటి బిడ్డను ఎత్తుకుని సల్మాన్ కు కనిపించింది. ఆ వెంటనే.. సల్మాన్ ఆ చంటి బిడ్డ దగ్గర ఆగి, 'బాబా, పాపా?' అని అడిగి, బిడ్డ తలపై చేయివేసి నిమురుతూ, చేతిని పట్టుకుని ఆడుతూ ఆ కుటుంబ సభ్యుల మంచి చెడ్డలు ఆరాతీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, సల్మాన్ అప్పుడప్పుడు తన మేనల్లుడితో ఆడుకుని రిలాక్స్ అవుతాడన్న సంగతి తెలిసిందే. ఆ వీడియో చూడండి.

  • Loading...

More Telugu News