: గచ్చిబౌలికి సమీపంలో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసిన సినీ హీరో నాని
వరుస విజయాలతో దూసుకుపోతూ, నిర్మాతల పాలిట మినిమం గ్యారంటీ హీరోగా అవతరించాడు హీరో నాని. ఇటీవల విడుదలైన 'నేను లోకల్' సినిమా మంచి హిట్ అయింది. త్వరలోనే 'నిన్ను కోరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు మరోసారి రానున్నాడు. ఈ సందర్భంగా, హైదరాబాద్ శివార్లలో ఓ ఖరీదైన ఇంటిని నాని కొన్నాడనే వార్తలు వస్తున్నాయి. గచ్చిబౌలికి సమీపంలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశాడట. దీని ఖరీదు రూ. 5 కోట్లు. త్వరలోనే నాని కుటుంబం ఈ ఇంటిలోకి షిఫ్ట్ అవుతుందట.