: 'దంగల్' నటికి తృటిలో తప్పిన ప్రమాదం
అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా 'దంగల్'లో నటి జైరా వాసిం మంచి నటనతో ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. తాజాగా ఆమె ఓ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. శ్రీనగర్ ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి దాల్ లేక్ లో పడిపోయింది. బౌలేవార్డ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆమెను రక్షించారు. అయితే, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి మాత్రం గాయాలు అయ్యాయి. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.