: 'నేనే రాధ నేనే భార్య' అని కాజల్ అంటే... కాదు 'నేనే రాణి నేనే భార్య' అంటున్న కేథరీన్!
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్న 'నేనే రాజు...నేనే మంత్రి' సినిమాలో ఒక్కో నటుల ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేస్తోంది. 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ రానా లుక్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుండగా, తాజాగా ఈ సినిమాలో రానాకు జంటగా నటిస్తున్న కాజల్ అగర్వాల్, కేథరీన్ ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
'నేనే రాధ...నేనే భార్య' అంటూ కాజల్ సంప్రదాయ బద్ధంగా కనిపిస్తుండగా, కాదు 'నేనే రాణి...నేనే భార్య' అంటూ కేథరీన్ ట్రెండీ లుక్ లో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా అఫీషియల్ పేజ్ తో పాటు నటీనటుల పేజ్ లలో కూడా సందడి చేస్తున్న ఈ ఫస్ట్ లుక్ లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమాలో నటిస్తున్న పలువురి పాత్రల ఫస్ట్ లుక్ ను నేడు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనుంది.