: మహా ముదురు....: జైలులాంటి బెడ్ నుంచి చిన్నారి తమ్ముడ్ని అన్న ఎలా బయటపడేశాడో చూడండి!


సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికి 32 మిలియన్ల మంది వీక్షించిన ఆ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జైలు లాంటి బెడ్ నుంచి ఎలా తప్పించుకుని పైకి రావాలో అన్న చేసి చూపించి, ప్రోత్సహించి, సహాయం చేసి, తమ్ముడిని బెడ్ నుంచి బయటకు తీసుకురావడం కనిపిస్తోంది. ఈ అన్నదమ్ములిద్దరూ చేసిన ఘన కార్యం మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో దానిని చూసిన తల్లిదండ్రులు..సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అవుతోంది.

ప్రధానంగా తమ్ముడికి అన్న శిక్షణనిచ్చి...'కమాన్ ఫిన్ యూ కెన్ డూ ఇట్' అంటూ ప్రోత్సహించిన విధానం...బయటపడేందుకు సాయం చేసి 'చూశావా? యూ డిడ్ ఇట్' అంటూ అభినందించిన విధానానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.




  • Loading...

More Telugu News