: బ్యాటింగ్ చేసి, అలరించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా!
రాజకీయాల్లో అనుక్షణం బిజీగా గడిపే వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు క్రికెట్ ఆడారు. చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో జరుగుతున్న వైసీపీ గ్రామీణ క్రికెట్ పోటీలను నిన్న ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ, వారితో కాసేపు క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ చేసి అలరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు తన హయాంలో కనీసం ఒక్క క్రీడాకారుడినైనా తయారు చేశారా? అని ప్రశ్నించారు. యువత పక్కదారి పట్టకుండా... వారిని క్రీడలవైపు మళ్లించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. క్రీడల కోసం ఒక్క పైసా నిధులను కూడా విడుదల చేయని చంద్రబాబు... ఒలింపిక్స్ క్రీడలను నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పారు.