: విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కు బొగ్గు సరఫరా ఆపేసిన సింగరేణి!
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్) కు సింగరేణి, తాల్చేరు నుంచి బొగ్గు సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం ఒక్క రోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇది కూడా అయిపోతే, విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో, సింగరేణి, తాల్చేరు యాజమాన్యాలతో ఏపీ జెన్ కో అధికారులు చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి వీటీపీఎస్ లో ప్రతి రోజు మూడు లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉంటాయి.