: విద్యార్థి మాయం.. హైదరాబాదులోని నారాయణ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న నారాయణ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీకి చెందిన సమత క్యాంపస్ లో ఉంటున్న గౌరీశంకర్ అనే విద్యార్థి గత నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ సమాచారాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం చేరవేయలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఈరోజు కాలేజీ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి.