: పెద్ద నటుడు, శ్రీమంతుడు అయినా... కటిక నేలపైనే పడుకున్న బాలయ్య... మీరూ చూడండి!


ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలయ్య... కాలు తీసి కాలు వేస్తే సకల రాజభోగాలు ఉంటాయి. షూటింగ్ సమయంలో సైతం చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా సకల ఏర్పాట్లు ఉంటాయి. మరి విదేశాల్లో షూటింగ్ అయితే, ఇక్కడున్నన్ని సౌకర్యాలు అక్కడుండవు. సేద తీరడానికి క్యారవాన్లు ఉండవు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య సినిమా పోర్చుగల్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

విదేశాల్లో షూటింగ్ సమయంలో చాలా మంది స్టార్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ, బాలయ్య రూటే వేరు. షూటింగ్ గ్యాప్ లో కటిక నేల మీద పడుకుని, తల కింద, కాలికింద దిండ్లు పెట్టుకుని హాయిగా రెస్ట్ తీసుకున్నారు. ఆయన సింప్లిసిటీ చూసి యూనిట్ సభ్యులు సైతం ఆశ్యర్చపోయారు. పరిస్థితులను బట్టి సర్దుకుపోవడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అంటూ వారు కితాబిచ్చారు. గొంతెమ్మ కోర్కెలు కోరుతూ, నిర్మాతను ఇబ్బంది పెట్టడం బాలయ్య చరిత్రలోనే లేదని అన్నారు. ఇదే విషయం ప్రస్తుతం పోర్చుగల్ లో మరోసారి రుజువైందని తెలిపారు. 

  • Loading...

More Telugu News