: సౌదీ అరేబియాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఐసిస్


ఇరాన్ పార్లమెంటుపై దాడి జరిపింది తామేనని ఉగ్ర సంస్థ ఐసిస్ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను వారు విడుదల చేశారు. ఇరాన్ పై అటాక్ ముందు ఈ వీడియోను తీశారు. ముసుగు ధరించిన ఐదుగురు ఐసిస్ ఫైటర్స్ మాట్లాడుతూ ఇరాన్ లోని షియా ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అల్లా అనుమతితో తాము ఈ పని చేస్తున్నామని... ఇరాన్ లో జీహాద్ కోసం పోరాడతామని చెప్పారు. ముస్లింలు తమతో పాటు కలసిరావాలని కోరారు. అనంతరం సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇరాన్ తర్వాత మా టార్గెట్ మీరే నంటూ సౌదీకి వార్నింగ్ ఇచ్చారు. తాము ఎవరికీ ఏజెంట్లు కాదని... అల్లాను మాత్రమే తాము అంగీకరిస్తామని చెప్పారు. మతం కోసం తాము పోరాడుతున్నామని.. అంతేకాని ఇరాన్ కోసమో, అరేబియన్ పీఠభూమి కోసమో కాదని చెప్పారు. 

  • Loading...

More Telugu News