: భూమి కొన్నమాట నిజమే.. కానీ..: కేకే


కబ్జా చేసిన భూములను తమ కుటుంబం కొన్నదన్న వార్తలపై టీఆర్ఎస్ సీనియన్ నేత, ఎంపీ కేకే స్పందించారు. 2013లో హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో తాము భూమి కొన్న మాట నిజమేనని.... అయితే, వివాదంలో ఉన్న భూములను మాత్రం తాము కొనలేదని చెప్పారు. తాను కొన్న భూములు ప్రభుత్వానికి చెందినవి కాదనే విషయాన్ని సీసీఎల్ఏ స్పష్టం చేసిందని తెలిపారు. దీనికి సంబంధించి హైకోర్టు ఆర్డర్ కూడా ఉందని వెల్లడించారు. తాను కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ కలెక్టర్ ఉత్తర్వులు కూడా ఉన్నాయని... కలెక్టర్ ఉత్తర్వులు తప్పయితే కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News