: జాగ్రత్తగా ఉండండి.. భారీ వర్షాలు కురిసే అవకాశం!
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే కోస్తాంధ్రలో కూడా మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనికి తోడు, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు.