: మోదీ వైజాగ్ పర్యటనతో పాటు బీజేపీ కార్యవర్గ సమావేశాలు వాయిదా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనతో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ మేరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని పర్యటనను వాయిదా వేశామని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం జూలై 17న జాతీయ ఎన్నికల కమిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలతో కలిసి కాంగ్రెస్ జట్టు కట్టింది. బీజేపీ అభ్యర్థిపై పోటీకి తమ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అలసత్వం ప్రదర్శించకూడదని భావించిన బీజేపీ ఏపీలో నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను వాయిదా వేసింది. సమావేశాలు వైజాగ్ లోనే నిర్వహిస్తామని, అయితే, ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.