: గురుగ్రామ్‌లో మరో షాకింగ్ ఘటన.. మహిళ, ఆమె కుమార్తెపై మూడు వారాలపాటు ఎస్సై కొడుకు అత్యాచారం!


గురుగ్రామ్ అత్యాచారాలకు అడ్డంగా మారుతోంది. మనేసర్‌లో ఇటీవల ఓ వివాహితపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆమె 8 నెలల కుమారుడిని రోడ్డుపై విసిరేసిన ఘటనను మర్చిపోకముందే అటువంటిదే మరో ఘటన జరిగింది. ఈసారి అత్యాచారానికి పాల్పడింది ఓ ఎస్సై కొడుకు కావడం గమనార్హం. ఓ వివాహిత, ఆమె 15 ఏళ్ల కుమార్తెపై మూడు వారాలపాటు అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఢిల్లీ  పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ కొడుకు ఆశిష్ కుమార్ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిపై అత్యాచారం చేస్తుండగా తీసిన వీడియోలను బయటపెడతానని బెదిరించి వారిపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి అటువంటి పది వీడియో క్లిప్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ వీడియోలన్నీ బాధిత మహిళ (35), తన కుమార్తె, కుమారుడు (11)తో కలిసి ఉంటున్న ఇంట్లో తీసినవేనని వివరించారు. బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆశిష్‌ బాధిత మహిళ ఇంట్లో ఉండగా శుక్రవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News