: వైజాగ్ వెళ్తూ... విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు


హైదరాబాదు నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా కొట్టిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. ఎస్జీకే ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాదు నుంచి వైజాగ్ వెళ్తోంది. అర్ధరాత్రి దాటిన తరువాత ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో అకస్మాత్తుగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి, బోల్తా పడింది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, ఇతరులు చిన్న గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News