: ఆ వార్తలు అసత్యం... నేను నిబంధనల ప్రకారమే శశికళను కలిశాను: విజయశాంతి


తెలంగాణలో రాజకీయ భవిష్యత్ శూన్యమని నిర్ణయానికి వచ్చి, తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న మాజీ సినీ నటి విజయశాంతి, జైలు నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల రాత్రి ఏడుగంటలు దాటిన తర్వాత శశికళతో సమావేశమయ్యారంటూ పెద్దగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలపై విజయశాంతి మండిపడింది. ఆ వార్తలు అవాస్తవమంటూ ఖండించింది. తాను నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించానని, బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:15 నిమిషాల వరకు శశికళతో భేటీ అయ్యానని ఆమె తెలిపారు. ఆ తరువాతే దినకరన్ ను కలిశానని చెప్పారు. కాగా, తమిళ రాజకీయాల్లో విజయశాంతి భవిష్యత్ పై పలు కథనాలు ప్రసారమవుతున్నాయి.

  • Loading...

More Telugu News