: పలు దేశీయ విమానాలు రద్దు... శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన!


హైదరాబాదు శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమానాలు రద్దవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ముందుగా ప్లాన్ చేసుకుని ప్రయాణం పెట్టుకుంటే...గోవా, కడప, చెన్నై, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ట్రూజెట్‌ విమానాలతో పాటు చండీగఢ్‌ వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాలు రద్దైనట్టు ఆలస్యంగా ప్రకటించడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న తరువాత సమాచారం ఇవ్వడం ఏంటని? అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News