: తెరపైనే కాదు.. తెరవెనుక కూడా లాయరే!: సినీ నటి ఇంద్రజ తరఫున వాదించి గెలిచిన ముమ్ముట్టి!
మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా హీరోగా హీరోయిన్ కు అండగా నిలిచారు. ప్రముఖ సినీ నటి ఇంద్రజకు తన మేనేజర్ తో నగదు లావాదేవీల్లో వివాదం ఏర్పడింది. దీంతో ఇద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ వివాదం చాలా కాలంగా కోర్టులో నడుస్తోంది. మమ్ముట్టికి ఈ విషయం తెలిసింది. దీంతో గతంలో లా చదివి, అడ్వకేట్ గా కూడా పనిచేసిన మమ్ముట్టి మరోసారి నల్లకోటు వేసుకున్నారు. ఇంద్రజ కేసును టేకప్ చేసి, కోర్టులో వాదించారు. ఈ కేసును గెలిచి ఇంద్రజకు న్యాయం జరిగేలా చేశారు. కాగా, గతంలో ‘నరసింహం’, ‘ట్వంటీ-20’, ‘హరికృష్ణన్స్’ వంటి సినిమాల్లో ఆయన న్యాయవాదిగా నటించారు.