: నా మీద నమ్మకముంచి స్క్రీన్ టెస్టు కూడా చేయకుండా ఆఫర్ ఇచ్చారు: దీపికా పదుకునే


బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోయి, హాలీవుడ్ మీద కన్నేసిన నటి దీపికా పదుకునే తన సినీ రంగ ప్రవేశంలో జరిగిన గమ్మత్తైన విషయం గురించి వెల్లడించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, మోడల్ గా ఆకట్టుకుంటున్న దశలో ఊహించని విధంగా తనకు 'ఓం శాంతి ఓం' సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. తానెప్పుడూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించలేదని చెప్పింది. తాను కనీసం సినిమా సెట్‌ కి కూడా వెళ్లలేదని చెప్పింది. డైలాగులు ఎలా చెప్పాలో కూడా తెలియదని తెలిపింది.

అయితే తనకు కనీసం స్క్రీన్ టెస్టు కూడా చేయకుండా షారూఖ్ ఖాన్, ఫరాఖాన్ ఎంపిక చేశారని చెప్పింది. డైలాగులు ఎలా చెప్పాలో తెలీదని, ఆ విషయం ఆలోచిస్తేనే వణుకు పుట్టేదని చెప్పింది. అలాంటి సమయంలో తనపై నమ్మకంతో వారిద్దరూ ఆ సినిమా ఆఫర్ ఇచ్చారని చెప్పింది. కాగా, ఆ సినిమా హిట్ కావడం, రణ్ బీర్ కపూర్ తో ప్రేమ, ఆ తర్వాత బ్రేకప్ కావడంతో మరిన్ని అవకాశాలు రావడం, అందులో కొన్ని సూపర్ హిట్ కావడంతో ఆమె జీవితం మొత్తం మారిపోయింది. ప్రస్తుతం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పద్మావతి’ సినిమాలో నటిస్తోంది.

  • Loading...

More Telugu News