: తీపికబురు చెప్పిన షియోమి.. రెడ్‌ మి స్మార్ట్‌ఫోన్‌ల‌ను ప్రీ ఆర్డర్‌ చేసుకునే అవకాశం!


చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ షియోమి... ఆన్‌లైన్‌లో త‌మ స్మార్ట్‌ఫోన్‌ల‌ను ఉంచ‌గానే నిమిషాల్లో అమ్ముడుపోతాయ‌న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఫ్లాష్‌ సేల్‌లోనే త‌మ స్మార్ట్‌ఫోన్‌ల‌ను అమ్మ‌కానికి ఉంచిన షియోమి ఈ రోజు మధ్నాహ్నం 12 గంటల నుంచి త‌మ స్మార్ట్‌ఫోన్‌ల‌ను ప్రీ ఆర్డర్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించి, త‌మ అభిమానుల‌కు తీపి క‌బురు అందించింది. అదికూడా అమెజాన్ వంటి ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్‌ల‌లో కాకుండా ఈ సారి త‌మ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. రెడ్‌ మి నోట్‌ 4,  రెడ్‌ మి 4, రెడ్‌ మి 4 ఏ స్మార్ట్‌ఫోన్లను వినియోగ‌దారులు బుక్‌ చేసుకోవచ్చు. వీటిని క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌ వాలెట్స్‌ ద్వారా మాత్ర‌మే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. రెడ్‌ మి నోట్‌ 4 ధర రూ. 9,999 గా ఉండ‌గా, రెడ్‌ మి 4 ధర రూ. 6,999, రెడ్‌ మి 4 ఏ ధ‌ర‌ రూ.5,999గా ఉంది.

  • Loading...

More Telugu News