: నా పెళ్లి నా వల్లే ఫెయిల్ అయింది!: మనీషా కొయిరాలా


తన పెళ్లి ఫెయిల్ అవడానికి కారణం తానేనని ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మనీషా కొయిరాలా తెలిపింది. ‘డియర్‌ మాయా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, తన భర్త సమ్రాట్ ను ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో, అతని అభిరుచులు నచ్చి 2010లో వివాహం చేసుకున్నానని చెప్పింది. వివాహం గురించి ఎన్నో కలలు కన్నానని తెలిపింది.

అయితే, అనుబంధం సరైనది కానప్పుడు విడిపోవడమే మంచిదని భావించానని చెప్పింది. అందుకే 2012లో విడాకులు తీసుకున్నానని తెలిపింది. అయితే ఇందులో తన భర్త తప్పు ఏమాత్రం లేదని చెప్పింది. తప్పంతా తనదేనని స్పష్టం చేసింది. కాగా, మనీషా పూటుగా తాగి పలు సందర్భాల్లో తూలుతూ మీడియా కంటబడిన సంగతి తెలిసిందే. అనంతరం కేన్సర్ బారిన పడింది. దాని చికిత్సకు సల్మాన్ ఆర్ధిక సహాయం చేశాడని మనీషా గతంలో తెలిపింది. దాని నుంచి కోలుకుని ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, నటిస్తోంది.

  • Loading...

More Telugu News