: త్వరలో వైట్‌హౌస్‌లో ట్రంప్ ను కలవనున్న భారత ప్రధాని మోదీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత భారత ప్రధాని మోదీ తొలిసారిగా ఆయనను కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో కలుసుకుని ఇరు దేశాల అగ్రనేతలు చర్చించనున్నారు. ట్రంప్, మోదీ ఇప్పటికి 3 సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. గతంలో ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఒబామాతో మోదీ మొత్తం 8 సార్లు భేటీ అయ్యారు.
యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి హేథర్ న్యూర్ట్.. తమ దేశంలో మోదీ పర్యటన గురించి మాట్లాడుతూ... భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరుకు ఆయన వాషింగ్టన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మోదీని తమ దేశానికి రమ్మని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలల ముందు ఆహ్వానించారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారు చర్చించనున్నారు. ఇరు దేశాధినేతల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి.