: క్లిష్టమైన జాబ్ ను కుర్రాళ్లు సమర్థవంతంగా చేపట్టడం టీమిండియాకు శుభసూచకం: మెక్ గ్రాత్


భారత్ లో పిచ్ లు చాలా కఠినమైనవని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ అన్నాడు. బెంగళూరులోని ఎంఆర్ఎఫ్ పౌండేషన్ లో యువకులకు బౌలింగ్ లో మెళకువలు నేర్పిన సందర్భంగా మెక్ గ్రాత్ మాట్లాడుతూ, భారత్ లో కఠిన పిచ్ లపై పేస్ బౌలింగ్ చేయడం చాలా కష్టమని అన్నాడు. అయితే యువకులు అంత క్లిష్టమైన పనిని ఇష్టంగా అలవోకగా చేస్తున్నారని చెప్పాడు. ఇది టీమిండియాకు శుభపరిణామమని చెప్పాడు.

గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియాలో స్థానం కోసం పేసర్లు శ్రమిస్తున్నారని, నిలకడగా ఆడుతూ జట్టుకు ఉపయోగపడుతున్నారని చెప్పాడు. పేస్ బౌలింగ్ లో స్థానం కోసం పోటీ పడడం శుభపరిణామమని చెప్పాడు. భారత్ పిచ్ లు స్పిన్, బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు. అలాంటి చోట పేసర్ తయారు కావాలంటే చాలా కష్టపడాలని చెప్పాడు. అలాంటిది టీమిండియా బౌలర్లు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసురుతున్నారని ఇది టీమిండియాకు లాభదాయకమని చెప్పాడు. 

  • Loading...

More Telugu News