: బాలయ్య కొత్త సినిమా ఫస్ట్‌లుక్ అదుర్స్‌: మ‌ంచు మ‌నోజ్‌, చార్మీ


బాల‌కృష్ణ హీరోగా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న కొత్త‌ చిత్రం టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను ఈ రోజు ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ‘పైసా వ‌సూల్‌’ సినిమాలో బాల‌కృష్ణ మాఫియా డాన్‌గా క‌నిపించనున్నాడు. ఫ‌స్ట్‌లుక్‌లో బాల‌య్య క‌న‌బ‌రుస్తోన్న‌ స్టైల్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. మోడ్రన్ డ్రెస్సులో మాస్ యాంగిల్‌లో ఆయ‌న క‌న‌ప‌డుతున్నాడు. మ‌రో లుక్‌లో రౌడీల‌ను య‌మ‌కొట్టుడు కొడుతున్నాడు. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల‌పై స్పందించిన న‌టులు చార్మీ, మంచు మ‌నోజ్.. బాల‌య్య అదుర్స్ అని పేర్కొన్నారు. ఈ సినిమా నిజంగానే పైసా వ‌సూల్ చేసేస్తుంద‌ని అంటున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్‌కి ఆయ‌న టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు ట్వీట్ చేశారు.
 


  • Loading...

More Telugu News