: పాముని ఎంత సులువుగా పట్టేసిందో తెలుసా?... మీరూ చూడండి!


మహిళలు ఎలుకలు, బొద్దింకలు, కీటకాలు చూస్తే చాలు బెంబేలెత్తిపోతారు. అలాంటిది ఒక మహిళ ఏకంగా పెద్ద పాముని అత్యంత సులభంగా పట్టేసి ఇంటికి దూరంగా విడిచిపెట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని నార్త్ కరొలినాలో సన్ షైన్ మెక్ కర్రీ అనే మహిళ నివాసంలోకి ఒక పాము దూరింది. 6 నుంచి 7 అడుగుల పొడవున్న పామును చూసి ఆడవాళ్లే కాదు పురుషులు కూడా భయపడతారు. తన చేతికి ఓ పిల్లో కవర్ ను ధరించిన ఆమె... ఆ పామును అలా ఒడుపుగా పట్టేసి, ఇలా బంధించేసింది. దీనిని ఆమె కుటుంబ సభ్యులు వీడియో తీసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు పామును పట్టుకోవడం ఇంత సులభమా? అని ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News