: ఇది వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే... బరాక్ ఒబామా ఎనిమిదేళ్ల పాటు ఒకే సూట్ వేసుకున్నారు!


అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించిన ఓ రహస్యాన్ని ఆయన భార్య మిషెల్ ఒబామా బయటపెట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ... అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్లు ఒకే సూట్‌ ధరించారని అన్నారు.

ఫస్ట్ లేడీ హోదాలో తాను హాజరయ్యే కార్యక్రమాలకు వేసుకెళ్లే దుస్తులు, షూస్‌, బ్రేస్‌ లెట్స్‌, నెక్లెస్‌ అంతా ఆసక్తిగా గమనించి ఫోటోలు తీసుకునేవారని ఆమె చెప్పారు. కానీ ఎనిమిదేళ్లు ఆయన ఒకే సూట్ ధరించినా ఎవరూ గుర్తించలేదు, విమర్శించలేదు, కనీసం ఆరోపించలేదని ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన చాలా గర్వపడతారని చెప్పారు. ఏదన్నా ఈవెంట్ ఉందంటే పదినిమిషాల్లో రెడీ అయిపోతానని ఆయన అంటే...సూట్ వేసుకోడానికి ఎంత సమయం పడుతుంది? అని తాను ఎద్దేవా చేస్తానని వెల్లడించారు. దీంతో ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. 

  • Loading...

More Telugu News