: ఉరీ సెక్టార్ లో చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో ఈ రోజు మరోసారి కలకలం చెలరేగింది. ఆ ప్రాంతం నుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. ఉగ్రవాదుల కదలికలను వెంటనే పసిగట్టిన భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్, భారత్‌లకు సరిహద్దుల్లో ఉన్న ఉరీ గుండా ప్రవేశించడానికి ఉగ్రవాదులు ఇటీవల చేసిన ప్రయత్నాన్ని కూడా భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. కొన్ని నెలల ముందు ఉరీ సెక్టార్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు భారత సైనికుల ప్రాణాలు తీసినప్పటి నుంచి అక్కడ భద్రతను మరింత పటిష్టం చేశారు.