: ప్రియాంకా చోప్రా బాటలో దీపికా పదుకునే....ఏంటా డ్రెస్సు? అని ప్రశ్నిస్తే... మరో ఫోటో పోస్టు చేసింది!


ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటనలో ఉండగా, హాలీవుడ్ సినిమా 'బేవాచ్' ప్రమోషన్ కోసం ఆ దేశంలో ఉన్న సినీ నటి ప్రియాంకా చోప్రా ఆయనను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కురచ దుస్తులు వేసుకుని, కాలు మీద కాలేసుకుని కూర్చోవడంతో నెటిజన్లు మండిపడ్డారు. ఆ బట్టలు ఏంటి? ఆ కూర్చోవడం ఏంటి? అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. అలాంటి విమర్శకులందరికీ సమాధానంగా.. మరింతగా శరీరం కనబడేలా ఇంకా తక్కువ బట్టలు వేసుకుని, తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను పెట్టి... 'మా బట్టలు మా ఇష్టం' అన్నట్టుగా మరో ఫోటో పోస్టు చేసింది.

 తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే మాగ్జిమ్ మ్యాగజీన్ కు ఇచ్చిన ఫోటోషూట్ సందర్భంగా దిగిన ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. ఈ ఫోటో మరీ దారుణంగా ఉందంటూ నెటిజన్లు మండిపడ్డారు. దేశసంస్కృతిని పెంచేలా వస్త్రధారణ ఉండాలని పలువురు హితవు పలికారు. హాలీవుడ్ సినిమాల్లో నటించగానే అమెరికన్ అయిపోయావా? అంటూ మరికొందరు నిలదీశారు. ఆ బట్టలేంటి? అని ఇంకొందరు నిలదీశారు. దీంతో వారందరికీ సమాధానంగా అలాంటి ఫోటోనే మరొకదానిని పోస్టు చేయడం ద్వారా...'నా బట్టలు నా ఇష్టం' అంటూ పరోక్షంగా సమాధానం చెప్పింది. దీంతో మరిన్ని విమర్శలు ఆమెపై కురుస్తున్నాయి. ఈ సారి హద్దు మీరి నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News