: భారత్‌కు నా శుభాకాంక్షలు: పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీప్‌


ఎస్‌సీఓలో సభ్యత్వం పొందిన శుభసందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌ షరీప్ పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లోకి పూర్తిస్థాయి సభ్యులుగా చేరుతూ నిన్న భారత్‌, పాకిస్థాన్‌లు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ... మన భవిష్యత్‌ తరాలు సైతం యుద్ధం, సంఘర్షణలవైపు వెళ్లకుండా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. అన్ని దేశాలు శాంతి, స‌హ‌నంతో ముందుకు వెళ్లాల‌ని పిలుపునిచ్చారు. ఇందుకు ఎస్‌సీఓ కృషిచేస్తుందని అన్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ... 12ఏళ్ల పరిశీలన అనంతరం భారత్‌కు ఇందులో సభ్యత్వం దక్కింద‌ని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.                

  • Loading...

More Telugu News