: పాన్ కార్డుకి ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు స్టే!
ప్రభుత్వ పథకాలు ఏవైనా వర్తించాలంటే ఆధార్ కార్డు తప్పని సరి. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు తప్పని సరి. స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి...ఇలా ప్రతి దానికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పని సరి చేస్తూ పోతుంటే...సుప్రీంకోర్టు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ వెళ్తోంది. ఆధార్ కార్డుల వివరాలు హ్యాకింగ్ కు గురయ్యాయని, వ్యక్తిగత వివరాలు అక్రమంగా చోరీ కాకుండా ఉండేందుకు తగిన విధానం రూపొందించే వరకు ఆధార్ తో పాన్ ను అనుసంధానం చేయకూడదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ స్టే ఇచ్చింది.
ఈ తీర్పు (పాన్ కు ఆధార్ ను అనుసంధానం) ప్రైవసీ విషయంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడే వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఆ తీర్పుననుసరించి, ఈ తీర్పులో సవరణలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి వ్యక్తి ఆదాయ వివరాలు అందజేయాలని, అందుకు పాన్ కార్డు వినియోగించాలని స్పష్టం చేసింది. అయితే పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం మాత్రం ప్రస్తుతానికి అవసరం లేదని స్పష్టం చేసింది.