: మళ్లీ చంద్రబాబే సీఎం కావాలి.. జగన్ వస్తే మాత్రం అయిపోతాం!: జేసీ దివాకర్ రెడ్డి


అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఉడేగోళంలో ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... విభ‌జ‌న త‌రువాత ఏపీలో ఎన్నో సమస్యలు ఏర్ప‌డిన‌ప్ప‌టికీ వాట‌న్నిటినీ అధిగ‌మిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత కూడా చంద్ర‌బాబు మళ్లీ సీఎం అయితే తప్ప మనకు భవిష్యత్ ఉండదని, అదే జగన్ వస్తే మాత్రం మ‌న ప‌ని అయిపోయిన‌ట్లేన‌ని ఆయ‌న చెప్పారు.

చంద్రబాబు నాయుడి కార్యదీక్ష, పట్టుదలను చూసి ప్రజలు మళ్లీ త‌మ పార్టీనే గెలిపించాలని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. లోటు బ‌డ్జెట్‌లో ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో ఎక్కడా పనులు ఆగడం లేదని ఆయ‌న అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు తీసుకెళుతున్నార‌ని ఆయ‌న అన్నారు.        

  • Loading...

More Telugu News