: పాక్ ను చూసి నేర్చుకోమంటూ.. కోహ్లీపై వినోద్ కాంబ్లి ఫైర్


ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ స్కోరు చేసి కూడా శ్రీలంకపై ఓడిపోవడంతో కెప్టెన్ కోహ్లీపై విమర్శల జడివాన కురుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సినీ విమర్శకుడు కేఆర్కే కోహ్లీని ఏకిపారేశాడు. తాజాగా, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి కూడా కోహ్లీపై ఫైర్ అయ్యాడు. గేమ్ ప్లానింగ్ ఎక్కడుందంటూ కోహ్లీకి సూటి ప్రశ్న వేశాడు. పాకిస్థాన్ ను చూసి నేర్చుకోవాలంటూ సూచన ఇచ్చాడు. ఇండియా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత... ప్రపంచ నంబర్ వన్ టీమ్ అయిన దక్షిణాఫ్రికాపై పాక్ ఎలా గెలిచిందో చూడాలని చెప్పాడు. భారత్ చేతిలో ఓడిన తర్వాత పాక్ అద్భుతంగా పుంజుకుందని కితాబిచ్చాడు. సౌతాఫ్రికాను 219 పరుగులకు కట్టడి చేయడమేకాక, 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసిందని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాక్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది.


  • Loading...

More Telugu News