: ల్యాండ్ అవుతుండగా పేలిన ఎయిరిండియా విమానం టైర్లు...బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు!


ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా టైర్ పేలిపోవడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...ఢిల్లీ నుంచి జమ్మూ మీదుగా శ్రీనగర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (ఏఐ) 821 విమానం జమ్మూ విమానాశ్రయంలో ప్రయాణికులను దించేందుకు సిద్ధమైంది. రన్ వేపై ల్యాండ్ అవుతుండగా విమానం టైర్లు పంక్చర్ అయ్యాయి. పెద్ద శబ్దం చేస్తూ నాలుగు టైర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో విమానం ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనైంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. అయితే పైలట్ విమానాన్ని అద్భుతంగా నియంత్రించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రన్ వే మాత్రం కాస్త దెబ్బతిందని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. 

  • Loading...

More Telugu News