: క్లీన్ షేవ్‌తో కొత్త లుక్‌లో కనిపిస్తోన్న మరో హీరో ఫొటో!


ఇటీవ‌లే యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ గెడ్డం, మీసాలు లేకుండా కొత్త లుక్‌లో క‌నిపించిన ఓ ఫొటో విప‌రీతంగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ కొత్త చిత్రం ‘సాహో’లో అలాగే క‌నిపించ‌నున్నాడ‌ని ఆయ‌న అభిమానులు పేర్కొన్నారు. ఇప్పుడు అచ్చం అటువంటి లుక్‌లోనే అంటే గెడ్డం, మీసాలు తీసేసిన లుక్‌లోనే క‌నిపిస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఆయ‌న క్లీన్ షేవ్‌లో ఉన్న ఓ ఫొటోను త‌న ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంల‌లో షేర్ చేశాడు. ‘నగరసూరన్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తోన్న సందీప్ కిష‌న్‌.. ఆ సినిమాలోని తన పాత్ర కోసమే ఇలా లుక్ మార్చేశాన‌ని చెప్పాడు.                      


  • Loading...

More Telugu News