: రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ అదుర్స్: సమంత, సాయి ధరమ్ తేజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మూవీకి ఈ రోజు ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ఇప్పటికే అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ లుక్ పై ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ను ఉంచిన ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ టైటిల్ పై స్పందించిన సమంత, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ టైటిల్ తమకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. ఈ టైటిల్ ఎంతో ఆసక్తిని రేపుతుందని ఈ లుక్‌ను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
#RC11Title Really looking forward to this one