: రేపు బాలకృష్ణ బర్త్ డే... హిందూపురంలో సందడే సందడి!


సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేపు పుట్టిన రోజును జరుపుకోనుండగా, ఆ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నియోజకవర్గంలో ఏర్పాట్లు చేసినట్టు బాలయ్య అభిమానుల సంఘం ప్రకటించింది. పుట్టిన రోజు ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకే పార్థసారధి, జడ్పీ చైర్మన్ చమన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభిమానులు వేడుకలు నిర్వహించనున్నారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తమ హీరో సాగుతున్నారని, ఆయనిచ్చే స్ఫూర్తితోనే తాము సేవా కార్యక్రమాలు సాగిస్తున్నామని బాలకృష్ణ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్‌ మోద్దీన్‌ వెల్లడించారు.

  • Loading...

More Telugu News