: సోనియాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండానే దూరమైన పాల్వాయి: భావోద్వేగంతో వీహెచ్


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండానే, తన చిన్ననాటి సహచరుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, తమను వీడి వెళ్లిపోయారని, సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం పాల్వాయి ఇంటికి వచ్చి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన వీహెచ్, మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని సోనియా వద్ద గట్టిగా పట్టుబట్టిన నేతల్లో ఆయన ఒకరని గుర్తు చేసుకున్నారు.

 ప్రత్యేక రాష్ట్రం ఇస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపించి చూపిస్తానని నాడు తనతో సహా అందరమూ చెప్పామని, ఆపై 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, 2019లో ఆ మాటను నిజం చేస్తానని పాల్వాయి పలుమార్లు సోనియా వద్ద చెప్పారని వీహెచ్ అన్నారు. ఇటీవలి సంగారెడ్డి సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, సోనియాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండానే ఆయన మరణించడం బాధగా ఉందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిన్నటి వరకూ యాక్టివ్ గా ఉన్న ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకు తీరని లోటని చెప్పారు. 

  • Loading...

More Telugu News