: ఇన్ఫోసిస్ లో తీవ్ర అలజడితో ఈక్విటీ భారీ పతనం... వ్యవస్థాపకుల సర్దిచెప్పే ప్రయత్నం!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నుంచి వ్యవస్థాపకులు పూర్తిగా తప్పుకోనున్నారని, తమకున్న వాటాను విక్రయించాలని భావిస్తున్నట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో వచ్చిన వార్త మార్కెట్ వర్గాల్లో కలకలం సృష్టించగా, ఆ సంస్థ ఈక్విటీ నేటి ట్రేడింగ్ సెషన్ లో 3.5 శాతం వరకూ పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు వ్యవస్థాపకులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తమ వాటాలను విక్రయిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి ఖండించారు. ఇదే వార్తపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందిస్తూ, ఇది నిరాధారమైన వార్తని ఓ ప్రకటనలో తెలిపింది. నారాయణమూర్తి నుంచి, ఆపై ఇన్ఫీ నుంచి వచ్చిన ప్రకటనతో కాస్తంత కోలుకున్న ఈక్విటీ ప్రస్తుతం 1.7 శాతం నష్టంలో సాగుతోంది.