: సుష్మా మేడమ్, దయచేసి హెల్ప్ చేయండి: అమెరికాలో కాల్పులకు గురైన తెలంగాణ యువకుడి తండ్రి


తెలంగాణకు చెందిన ముబీన్ అహ్మద్ ఐదు రోజుల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ను ముబీన్ కుటుంబ సభ్యులు కలిశారు. తన కుమారుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని... కాలిఫోర్నియాలో తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి ఈ మేరకు లేఖ వచ్చిందని, ఈ సందర్భంగా ముబీన్ తండ్రి ముజీబ్ అహ్మద్ కేంద్రమంత్రికి తెలిపారు. ఆసుపత్రిలో తన కుమారుడిని చూసుకోవడానికి ఎవరూ లేరని... తాము అమెరికా వెళ్లడానికి వీసా ఇప్పించాలంటూ ఆమెను విన్నవించారు. మరోవైపు, ముబీన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని నిన్న సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. 

  • Loading...

More Telugu News