: నాలుగు తరాల నేతలతో కలసి పనిచేసిన ఘనత పాల్వాయిది!


సిమ్లాలో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆయన... ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు కులుమనాలి వెళ్లిన సమయంలోనే, ఆయన గుండెపోటుకు గురయ్యారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే గడిపిన పాల్వాయి... భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డిల కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఏకంగా నాలుగు తరాల నేతలతో కలసి పని చేసిన ఘనత ఆయనది. దివంగత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో కలసి ఆయన పని చేశారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలంతా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

  • Loading...

More Telugu News