: అంతమాత్రాన, మా మధ్య ఏదో ఉన్నట్టు కాదు: హెబ్బాపటేల్


హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు తరచుగా మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెబ్బాపటేల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తామిద్దరం కలిసి నటించిన సినిమాలు హిట్ అవడం వల్ల, తమ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, అంతమాత్రాన, తమ మధ్య ఏదో ఉందనే అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పింది.

ఈ వార్తలను ప్రసారం చేయడంలో మీడియా సీరియస్ గా ఉన్నప్పటికీ, రాజ్ తరుణ్, తాను మాత్రం ఈ విషయాన్ని చాలా సరదాగా తీసుకుంటామని, తమ మధ్య ఉంది కేవలం స్నేహం తప్పా మరేం లేదని హెబ్బాపటేల్ క్లారిటీ ఇచ్చింది. తాను నటించిన సినిమాలను థియేటర్ కు వెళ్లే చూస్తానని, అయితే, ఎవరికంటా పడకుండా కొంచెం జాగ్రత్త పడతానని చెప్పింది. రెండేళ్ల నుంచి విరామం లేకుండా నటిస్తున్నానని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్టు హెబ్బాపటేల్ చెప్పింది.

  • Loading...

More Telugu News