: హంగ్ పార్లమెంట్ దిశగా ఫలితాలు.. థెరిసా మే విజయావకాశాలను దెబ్బతీసిన బ్రిటన్ ఉగ్రదాడులు!
బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని... థెరిసా మే మరోసారి ప్రధాని అవుతారన్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రచార సమయంలో జరిగిన రెండు ఉగ్రదాడులు కన్జర్వేటివ్ పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్ లో మ్యాజిక్ ఫిగర్ 326 స్థానాలు. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ లో కన్జర్వేటివ్ పార్టీ 290 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... జిరోమీ కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 249 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో, బ్రిటన్ లో హంగ్ తప్పదని ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ పౌండ్ విలువ మార్కెట్లో పతనమవుతోంది.